పార్వతీపురం: అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాల సర్వేను ఈనెల 2 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతిని గురువారం కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్టేజ్ అప్ గ్రేడ్ విధిగా జరగాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇనుము ధర తగ్గుదల ఉందని, ఇసుక లభ్యంగా ఉందని, ఉపాధి హామీ కింద వేతనాలు పెరిగాయని, మరుగుదొడ్లు లేని వారికి మంజూరు చేస్తామని తెలిపారు. ఈనెల 20 నాటికి మొదటి దశ పూర్తి చేస్తే ఈనెల 21 నాటికి వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు. జిల్లాలో వివిధ దశల్లో నిర్మాణాలు ఆగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు చెందిన 10,717 గృహాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వీటిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.పి4 సర్వే త్వరగా పూర్తి చేయండిపి4 సర్వేలో భామిని, బలిజీపేట మండలాలు వెనుకబడి ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వీటిని త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఉపాధి హామీ లో 334 ప్రహరీలుఉపాధి హామీ కింద జిల్లాలో 334 ప్రహరీ గోడలు, 988 గోశాలలు, 7342 ఇంకుడు గుంతలు మంజూరు అయ్యాయని చెప్పారు. 311 ప్రహారీ గోడలు, 894 గోశాలలు నిర్మాణం ప్రారంభం అయ్యాయని, 4284 ఇంకుడు గుంతలు పూర్తి అయ్యాయని ఆయన వివరించారు. బిల్లులు చెల్లింపులకు వెంటనే అప్ లోడ్ చేయాలని ఆయన అన్నారు. ఉపాధి వేతనదారుల వేతనాలు నిర్దేశిత వేతన స్థాయికి చేరుకోవాలని ఆయన చెప్పారు. పంట గుంతలను అధిక సంఖ్యలో ఏర్పాటు చేయాలని అన్నారు. జిల్లాలో 11250 లక్ష్యంగా ఉందని, వీటిని పెద్ద ఎత్తున వినియోగించుకోవడం వల్త సుస్థిర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుందని అన్నారు. సమావేశంలో కెఆర్‌ఆర్‌సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.ధర్మచంద్రా రెడ్డి, డిఆర్‌డిఎ, డ్వామా పీడీలు ఎం.సుధారాణి, కె.రామచంద్ర రావు, ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తమర్భ కొండలరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్.భాస్కర రావు, తదితరులు పాల్గొన్నారు.15న ప్రతి గ్రామంలో స్వచ్ఛంధ్రా – స్వర్ణాంధ్ర ప్రజాశక్తి – పార్వతీపురం జిల్లాలో ఈనెల 15న ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛంద్రా – స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో స్వచ్చంద్రా కార్యక్రమాల వివరాలను నమోదు చేయాలని కలెక్టర్ తహశీల్దార్లకు సూచించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం సబ్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రీసర్వే పక్కగా జరగాలని, రీసర్వేను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. పిఎంఎవై 1.0 కింద ఇళ్లు మంజూరై వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న బిసి, ఎస్సి, ఎస్‌టిలకు యూనిట్ విలువకు అదనంగా ఆర్థిక సహాయం అందిస్తుందన్న సంగతిని లబ్దిదారులకు వివరించి, త్వరితగతిన పూర్తిచేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే గ్రామసభలో వచ్చిన విజ్ఞప్తులపై మండల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.మ్యూటేషన్లు, అడంగల్ తదితర వాటిపై తక్షణమే స్పందించాలని, సమస్యలున్న చోట వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని హితవు పలికారు. స్రిబిజి కొరకు ప్రతి మండలంలో 500 ఎకరాల వరకు ప్రభుత్వ స్థలం అవసరమని, స్థలం అందుబాటులో ఉన్న మండలాల వివరాలు తమకు సమర్పించాలని కలెక్టర్ కోరారు. పిజిఆర్‌ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు అశుతోష్ శ్రీవాస్తవ, సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డిఆర్‌ఒ కె.హేమలత, కెఆర్‌ఆర్ ప్రత్యేక ఉప కలెక్టర్ పి.ధర్మ చంద్రారెడ్డి, మండల తహశీల్దారు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.
