భామిని: మండలంలోని సింగిడి గ్రామానికి చెందిన పింటూ శాంత్రో అనే వ్యక్తి సింగిడి పరిసరాలు సంచరిస్తున్న నాలు గు ఏనుగుల గుంపులు వద్ద తాగిన మైకంలో సోమవారం సాయంత్రం అరటిపండ్లను తీసుకెళ్లి తినాలనిపించుకున్నాడు. అయితే ఆ క్షణంలో ఒకసారి ఏనుగలి అతనిపై దాడి చేశాయి. కొద్దిపాటి స్పృహతో ఉన్న పింటూ శాంత్రో పొలాల గట్లలో దాక్కుని ఏనుగుల గుంపునకు దొరక్కుండా సుమారు గంటన్నర పాటు ఏనుగుల మధ్య ఉండిపోయాడు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది, బత్తిలి ఎస్‌ఐ అనీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఏనుగుల గుంపును తరిమివేసి పింటూ శాంత్రోను రక్షించారు. ఏం జరిగిందోనని సింగిడి పరిసరాలల్లో చేరుకున్న జనాలు గుంపు పింటూ శాంత్రో సజీవంగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి కావ్వింపు చర్యలకు పాల్పడి, ఎవరూ ప్రాణాల మీద తెచ్చుకొని ప్రాణాలను కోల్పోవద్దని పోలీసులు హెచ్చరించారు.
