ప్రజాశక్తి-పార్వతీపురం : బాల్య వివాహాల రహిత జిల్లా లక్ష్యం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ పిలుపునిచ్చారు. బాల్య వివాహ ముక్తభారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ, అప్‌హోల్డ్ సంస్థ, విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 నాటికి పార్వతీపురం మన్యం జిల్లా బాల్యవివాహాల రహిత జిల్లాగా రూపాంతరం చెందుటకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చిన్నారులకు బాల్యవివాహాలు చేయకుండా తల్లిదండ్రులు సహకరించాలన్నారు. కురుపాం : బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని ఎంపిడిఒ జె.ఉమామహేశ్వరి అన్నారు. బుధవారం ఎంపిడిఒ కార్యాలయం నుండి కురుపాం ప్రధాన రహదారి వరకు బాల్య వివాహాల వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఇఒపిఆర్‌డి జి.రమేష్ బాబు, ఎస్ సొసైటీ కార్యదర్శి షేక్ గౌస్, ఐసిడిఎస్, వెలుగు సిబ్బంది పాల్గొన్నారు.పార్వతీపురంరూరల్ : బాల్య వివాహాలను రూపుమాపేందుకు అందరూ కట్టుబడి ఉండాలని ఎంపిడిఒ కె.రూపేష్ అన్నారు. బుధవారం ఎంపిడిఒ కార్యాలయంలో బాల్యవివాహాల నిర్మూలన ప్రతిజ్ఞను అధికారులతో చేయించారు. కార్యక్రమంలో ఎపిఒ ఎస్‌విఎ కృష్ణారావు, ఎపిఎం సన్నిబాబు, ఇఒపిఆర్‌డి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.పాచిపెంట : బాల్య వివాహాల వల్ల నష్టాలపై కెజిబివి విద్యార్థినులకు ఐసిడిఎస్ సిడిపిఒ బి.అనంతలక్ష్మి అవగాహన కల్పించారు. అనంతరం బాల్యవివాహాలపైన ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కెజిబివి ప్రిన్సిపల్ ఉషారాణి, ఐసిడిఎస్ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.బలిజిపేట : మండల కేంద్రంలో ఐసిడిఎస్ సిడిపిఒ సులేఖ ఆధ్వర్యాన బాల్యవివాహాలపై అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.