పాఠశాలను విలీనం చేయొద్దని ఎంఇఒకు వినతి

Apr 12,2025 21:43

కురుపాం: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలో గల 3,4,5 తరగతులను కురుపాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విలీనం చేయొద్దని మండల కేంద్రంలో గల గౌడువీధిలోని ప్రాథమిక పాఠశాల చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఇఒ ఎన్‌.సత్యనారాయణకు శనివారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు జి.మనోజ్‌, జి.ప్రకాష్‌, మజ్జి మాట్లాడుతూ తమ వీధికి దగ్గర ఉన్న పాఠశాలకు తప్ప జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు మా పిల్లలను పంపించమన్నారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే ప్రధాన రహదారిని దాటుకొని వెళ్లాలని, నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు దాటేటప్పుడు ఏ క్షణాన ఎటువంటి ప్రమాదం జరగవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.కూలి పని చేస్తూ జీవనం సాగించే తాము ప్రతిరోజు పిల్లల్ని బడికి తీసుకెళ్లలేమన్నారు. కావున ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి మా వీధికి దగ్గర ఉన్న పాఠశాల నుంచి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు 3,4,5 తరగతుల విలీనం చేయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.నడిమికెల్లలో వైద్య శిబిరం వీరఘట్టం : మండలంలోని నడిమికెళ్లలో శనివారం స్థానిక వైద్యాధికారి బి.ప్రదీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, చిన్నారులు, మధుమేహ, రక్తపోటు,తదితర రకాలైన రోగులకు ప్రత్యేక వైద్య తనిఖీలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పి, ఎఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, 104 సిబ్బంది, రోగులు పాల్గొన్నారు.

➡️