పోలింగ్‌ కేంద్రాలు చేరుకున్న సిబ్బంది

May 12,2024 21:24

సీతానగరం  :మండలంలోని 62 పోలింగ్‌ కేంద్రాలకు సిబ్బంది ఆదివారం చేరుకున్నారు. అయితే కేంద్రాల్లో పోలింగ్‌ సిబ్బందికి ముందస్తుగా మౌలిక సదుపాయాలు మంచినీరు, బాతురూమ్‌, లైటింగ్‌ ఏర్పాట్లు చూస్తున్నట్లు బూత్‌ అధికారులు తెలిపారు. పోలింగ్‌ నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపట్టారు.పార్వతీపురం టౌన్‌: పట్టణంలో ఏర్పాటు చేసిన 35 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ఈవీఎంలు ఎన్నికల సామాగ్రితో పట్టణంలో గల పలు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు.

➡️