ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్: ప్రజల ఆరోగ్యం కోసం మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రతిరోజూ పారిశుద్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని మున్సిపల్ వైస్ చైర్మన్ ఇండుపూరు గున్నేష్ అన్నారు. భోగి పండుగను పురస్కరించుకొని సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ప్రజారోగ్య విభాగంలో విధులు నిర్వహిస్తున్న 138 మంది పర్మినెంట్, కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేశారు. సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ ఆధ్వర్యంలో గున్నేష్ సతీమణి ఉషారాణి, కుమారుడు వెంకటేష్, కోడలు సుష్మా, మనుమడు ఇషాంత్, మనుమరాలు సహస్రతో కలిపి అందజేశారు.
