విద్యార్థి అనుమానస్పద మృతి

Feb 1,2025 21:17

ప్రజాశక్తి – పాలకొండ: స్థానిక తమ్మినాయుడు ఇంటర్‌ కళాశాలలో శనివారం ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్న విద్యార్థి మీరబిళ్ల నిఖిల్‌ (16) అనుమానస్పద మృతి చెందాడు. కొత్తూరు మండలం కురుగాంకు చెందిన నిఖిల్‌ పదో తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించడం వల్ల తమ్మినాయుడు కళాశాలలో ఫ్రీ ఎడ్యుకేషన్‌ కింద ఎంపిసి గ్రూపులో చేర్చుకున్నారు. అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. పండగ సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు సీనియర్లతో తగాదా లున్నట్లు చెప్పాడు. పండగలు సెలవుల్లో అనంతరం ఎప్పటిలాగే కళాశాలకు వచ్చాడు. శుక్రవారం 8 గంటలకు సమయంలో మూడు అంతస్తుల నుంచి కిందకి పడిపోయినట్లు గుర్తించిన యాజమాన్యం హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళంలో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ప్రయోగమూర్తి కళాశాలకు చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

➡️