ఉద్యోగ భద్రత కల్పించాలి

Apr 10,2025 21:25

ప్రజాశక్తి – పార్వతీపురం రూరల్‌ : ఉపాధి హామీ పథకం విజయవంతం అవడంలో కీలకపాత్ర వహిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే బోనెల విజయచంద్రకు ఆయన క్యాంపు కార్యాలయంలో ఆ సంఘ నాయకులు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 19 ఏళ్లుగా ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న తమ వేతనం కింద రూ.26వేలు అందజేయాలన్నారు. మ్యాన్‌ డేస్‌ టార్గెట్‌ను రద్దుచేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. పీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలికురుపాం: కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లు స్థానిక ఎంపిడిఒ జె.ఉమా మహేశ్వరికి, ఎపిఒ పి.బావాజికి ఎంపిడిఒ కార్యాల యంలో గురువారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు యూనియన్‌ నాయకులు ఎం.మురళి, శ్రీహరి, మాధవ మాట్లాడుతూ 19ఏళ్లుగా ఉపాధి హామీలో ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్నమని, కానీ నేటికీ తమకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదని, కావున ఇప్పటికైనా కనీస వేతనం రూ.26 ఇస్తూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు అందరికీ ఎఫ్‌టిఇ అమలు చేస్తూ ప్రమాదవ శాత్తూ మరణించిన వారికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఉపాధి కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజు కూలి రూ.600కు పెంచాలని, మేట్లకు గౌరవ వేతనం, ఫోన్లు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మండలంలో గల ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

➡️