నేడు పోలమాంబ మారు జాతర

Feb 3,2025 21:24

మక్కువ: పోలమాంబ అమ్మవారి మారు జాతర మంగళవారం జరగనుంది. వనంగుడి వద్ద జరగనున్న జాతరకు దేవాదాయశాఖ ఇఒ సూర్యనారాయణ పర్యవేక్షణలో పటిష్ట ఏర్పాట్లు చేశారు. సాలూరు సిఐ రామకృష్ణ నేతత్వంలో 120 మంది పోలీసులతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నారు. జాతరకు వచ్చే యాత్రికులకు సాలూరు, పార్వతీపురం, బొబ్బిలి నుండి ఆర్‌టిసి బస్సులను నడపనున్నారు. అలాగే చదురుగుడి వద్ద కూడా ఎప్పటిలాగే ఏర్పాట్లు చేశారు. భక్తులకు అమ్మవారి ప్రసాదాలను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.

➡️