చిత్రలేఖనంపై శిక్షణ

May 19,2024 20:59

పాలకొండ : స్థానిక శాఖా గ్రంథాలయంలో వేసవి శిబిరాల్లో భాగంగా డ్రాయింగ్‌ మాష్టర్‌ జి.మురళి చిన్నారులకు డ్రాయింగ్‌ చేసే విధానాలు, వాటిలో కొన్ని మెళుకువలు నేర్పించారు. ఇందులో భాగంగా ఆదివారం పెన్సిల్‌ ఆర్ట్‌, రంగులు ఎలా వాడాలి తదితర అంశాలపై వివరించారు. సోమవారం పాటలు, నృత్యం ఉంటాయని ఇన్‌ఛార్జి గ్రంథాలయ అధికారి బబ్బురు గణేష్‌ బాబు తెలిపారు.గరుగుబిల్లి: స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా ఆదివారం పుస్తక పఠనం, క్విజ్‌ పోటీలు నిర్వహించారు. సుభాష్‌ చంద్రబోస్‌ జీవిత చరిత్రను విద్యార్థులకు చదివి వినిపించారు. ఆటల పోటీలు తదితర కార్యక్రమాలను ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తున్నట్టు స్థానిక శాఖా గ్రంథాలయ నిర్వాహకులు నల్ల మధుసూదన రావు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు వేసవి శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

➡️