ప్రజాశక్తి – సీతానగరం : స్థానిక వెలుగు కార్యాలయంలో ఉల్లాష్ కార్యక్రమంపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎపిఒ ఆర్.శ్రీరాములు ఆధ్వర్యంలో గ్రామైక్య సంఘల పరిధిలో పలువురు మహిళలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిటిడి కె.త్రివిక్రమరావు మాట్లాడుతూ మొదటి రోజు 18 గ్రామాలకు, రెండో రోజు 18 గ్రామాలకు శిక్షణ నిర్వహిస్తామన్నారు. నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి వారికి చదువుపై ఆసక్తి, అలాగే శ్రద్ధగా నేర్పించే కార్యక్రమమే ఉల్లాష్ కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్రతి గ్రామైక్య సంఘాల పరిధిలో 30 మంది చొప్పున నిరక్షరాస్యులైన మహిళలను గుర్తించి స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. యువతతో డిజిటల్ పద్ధతిలో చదువు నేర్పించడం జరుగుతుందన్నారు. కావున ప్రతి నిరాక్షులైన మహిళలు సమయం కేటాయించుకొని చదువు నేర్చుకోవాలన్నారు. చదువు నేర్చుకోవడం వల్ల రానున్న రోజుల్లో ఎంతో ఉపయోగపడుతుందని, అందువల్ల ప్రతి ఒక్క నిరాక్షులైన మహిళలు వ్యక్తిగత శ్రద్ధతో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సూర్యదేవుడుతో పాటు సిసిలు, విఒఎలు, గ్రామైక్య సంఘాల మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.సీతంపేట : నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ఎడి వైకుంఠరావు అన్నారు. మండలంలోని ఎంఎంఎస్‌లో గ్రామైఖ్య సంఘాలకు అక్షర వెలుగుపై శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు రోజుల పాటు శిక్షణ ఉంటుందని, దీన్ని వినియోగించుకోవాలని అన్నారు. నిరక్షరాస్యులను అక్షరాసులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. సభ్యులు అక్షరాసులుగా మారాలని చెప్పారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి ఎంపిడిఒ మానస, వెలుగు ఎపిడి సన్యాసిరావు, ఎపిఎం కమల పాండియన్ తదితరులు పాల్గొన్నారు.పార్వతీపురం రూరల్: డ్వాక్రా మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని అమలు చేస్తున్న ఉల్లాస పథకం విజయవంతం చేసి మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఒ కె.రూపేష్ అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశ భవనంలో డ్వాక్రా మహిళా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని, ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు మహిళలు అక్షరాస్యులుగా మారి స్వాలంబన సాధించాలన్నారు. కార్యక్రమంలో వెలుగు ఏపీఎం సన్ని బాబు తదితరులు పాల్గొన్నారు.వీరఘట్టం: నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ఉల్లాస్ ఉద్దేశమని ఎంపిడిఒ బి.వెంకటరమణ అన్నారు. స్థానిక మండల మహిళా సమైక్య కార్యాలయంలో అభ్యసన అవగాహన మండల స్థాయి శిక్షణ తరగతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 1430 మంది నిరక్షరాస్యులను గుర్తించి పదిమందికి ఒకరు చొప్పున వాలంటరు ద్వారా విద్యాభ్యాసం అందించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎపిఎం కె.రాము, ఎఫ్‌పిఒ సిసి వై.ఆనందరావు, విఒఎలు పాల్గొన్నారు.