గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి

May 25,2024 20:38

సీతానగరం/కురుపాం: గ్రామాల్లో ప్రశాంత వాతావరణ ఉండాలని సిఐ కె.రవికుమార్‌ అన్నారు. మండలంలోని రంగంపేట, వెంకటాపురం, వెన్నెల బుచ్చంపేటలో ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వతిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ప్రశాంత వాతావరణ ఉండాలని, ఎటువంటి అల్లర్లు, తగాదాల ఉండకూడదని చెప్పారు. జిల్లాలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై ఎం.రాజేష్‌, పోలీస్‌ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.కురుపాం : ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో ముందస్తు సమాచారం లేకుండా ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని ఎల్విన్‌పేట సిఐ సత్యనారాయణ అన్నారు. మండలంలోని శివన్నపేట, బియ్యాలవలస గ్రామాల్లో ఎస్సై షణ్ముఖరావు ఆధ్వర్యంలో ఎన్నికల ఫలితాలు రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ముందస్తు సమాచారం లేకుండా ఎటువంటి ర్యాలీలు, బాణా సంచాలు, డిజె సౌండ్‌లో వంటివి ఉపయోగించకూడదన్నారు. ప్రజలంతా కూడా ప్రశాంత వాతావరణంలో సోదరా భావంతో ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు. అనంతరం యువతకు వాలీబాల్‌ కిట్లు అంద

➡️