పార్వపురం: విశాఖ డెయిరీ ఆస్తులను లూటీ చేస్తూ ఆవు పాల సేకరణ ధర తగ్గించి, ధరలో కోత పెట్టిన విశాఖ పాల డెయిరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎపి పాల రైతుల సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి రమణమూర్తి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మునాయుడు, పాల రైతులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలతకు వినతిని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విశాఖ డెయిరీ యాజమాన్యం ఆవు పాలు సేకరణ 10శాతం తగ్గించిందన్నారు. అంత కుమునుపే నవంబర్‌లో సేకరణ ధర లీటరుకు రూ.4 తగ్గించారని, ఇలా వరుస పెట్టి పాల రైతులను కష్టపెట్టి, నష్టపరుస్తూ రైతులను నిండా ముంచుతున్నారన్నారు. పెరిగిన పశు పోషణ ఖర్చుల భారం రైతు భరిస్తూ సెంటరుకు పాలు పోస్తున్న రైతులకు న్యాయమైన ధర అందించవ లసిన బాధ్యతను విస్మరించి డెయిరీ యాజమాన్యం సహకార రంగం స్ఫూర్తికి భిన్నంగా నడుస్తోం దన్నారు. డెయిరీ నేడు స్వార్ధపరుల అక్రమాలకు అడ్డాగా మారిందన్నారు. ప్రభుత్వం డెయిరీపై వేసిన కమిటీ విచారణను వేగవంతం చేసి దోషు లను శిక్షించాలని, డెయిరీ ఆస్తులను కాపాడాలని కోరారు. డెయిరీని కంపెనీ చట్టం నుండి సహకార చట్టంలోకి మార్చాలని డిమాండ్ చేశారు.
