విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలి

Apr 14,2025 21:28

పార్వతీపురం: గ్రామ రెవెన్యూ సహాయకులకు కనీస వేతనాలు చెల్లించాలని, తెలంగాణ మాదిరిగా పే స్కేలు నిర్ణయించాలని విఆర్‌ఎల సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు వై.మన్మధరావు, జిల్లా కార్యదర్శి కృష్ణ డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక సుందరయ్య భవనంలో గ్రామ రెవెన్యూ సహాయకుల సమావేశం జి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విఆర్‌ఎల సమస్యలు పరిష్కారం చేయాలని, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నామినీలను విఆర్‌ఎలుగా గుర్తించాలని కోరారు. విఆర్‌ఎల సమస్యలపై ప్రజాప్రతినిధులకు రాయబారాలు నడపాలని, మే ఒకటిన మండల కేంద్రాల్లో మేడే జరపాలని, 27, 28, సామూహిక దీక్షలు చేపట్టాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ మధ్య చనిపోయిన విఆర్‌ఎ కమిటీ స్థానాల్లో కొత్తగా రాయిపల్లి సూర్యనారాయణ, బిబి తిరుపతిరావులను కమిటీలోకి తీసుకున్నామని చెప్పారు. సమావేశం అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆర్‌ సూర్యనారాయణ, బి తిరుపతిరావు, జి సాంబ, పవన్‌, కొండలరావు, బి రామారావు పాల్గొన్నారు.

➡️