ఎమ్మెల్సీగా విజయ గౌరీని గెలిపించండి

Feb 5,2025 21:28

ప్రజాశక్తి -వీరఘట్టం : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోరెడ్ల విజయగౌరీ గెలిపించాలని, యుటిఎఫ్‌ నాయకులు ఎస్‌.మహేశ్వరరావు ఉపాధ్యాయులను కోరారు. మండలంలోని తెట్టంగి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకురాలిగా విజయగౌరి గతంలో చేసిన ఉద్యమాలు, పోరాటాల గురించి వివరించారు. ఇంత వరకు శాసనమండలికి మహిళా ఉపాధ్యాయు రాలిని ఎన్నుకోలేదని, ఈ అవకాశాన్ని రెగ్యులర్‌, కాంట్రాక్టు, ఉపాధ్యాయులు సహకరించాలని ఆయన కోరారు. ఆరేళ్ల ఉపాధ్యాయ సర్వీసును వదిలి ఈ ఎన్నికల్లో పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఆమెకే వేసి గెలిపించాలని ఉపాధ్యాయు లను కోరారు. అనంతరం యుటిఎఫ్‌ ఎమ్మెల్సీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డి.నాగమణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️