స్త్రీనిధి రుణం తగ్గింపునకు యోచన

Apr 12,2025 21:41

పాచిపెంట: ప్రస్తుతం స్త్రీ నిధి పథకంలో తీసుకొన్న రుణాలకు రూ.0.90 శాతం వడ్డీ పడగా, ఆ వడ్డీని 0.70 శాతానికి తగ్గించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఎక్కువ మంది సభ్యులు స్త్రీ నిధి పథకంలో అప్పులు తీసుకోవాలని, అలాగే మహిళా సంఘాలు సభ్యులు పొదుపు నుంచి కూడా అప్పులు తీసుకొని, సంఘం ఆదాయం పెంచాలని సెర్ప్‌ అదనపు సిఇఒ కె.శ్రీరాములునాయుడు సూచించారు. మండలంలోని అమ్మవలసలో డిఆర్‌డిఎ పీడీ సుధారాణితో శనివారం పర్యటించారు. వార్షిక అప్పులు, జీవనోపాదులు ప్రణాళికలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ రూపొందించిందన్నారు. రాష్ట్రంలో 1.50 వేల మంది ఎన్యూమీటర్‌ లను నియమించి సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గంగమ్మ గ్రామ సంఘం పరిధిలో సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాల సభ్యులు ఒక గ్రూపుగా ఏర్పడి మెరుగైన ఆదాయం వచ్చే పద్ధతులు నిర్వహిస్తే, అధిక ఆదాయం వస్తుందని, ఆ విధంగా ఆలోచన చేయాలని సూచించారు. గతంలో తీసుకొన్న అప్పులు ఏ జీవనోపాధి కోసం వినియోగించారని సభ్యులను ప్రశ్నించగా, అదే గ్రామానికి చెందిన లక్ష్మీ గణపతి సంఘానికి చెందిన రౌతు లక్ష్మి గతంలో బ్యాంక్‌ లింకేజ్‌ రుణం రూ. 70 వేలు తీసుకున్నామని, రోజుకు 10 లీటర్ల పాలు అమ్మగా, నెలకు రూ.12 వేలు ఆదాయం వస్తుందని సిఇఒకు తెలిపారు. సర్వే చేస్తున్న ఎన్యూమునేటర్‌ జట్ల పార్వతి మాట్లాడుతూ సభ్యులకు సర్వే ఏ విధంగా చేస్తున్నావని, ఒక సభ్యురాలి ఆదాయం ఏవిధంగా లెక్కిస్తు న్నారని ప్రశ్నించగా, ప్రస్తుతం వస్తున్నా ఆదాయంలో ఖర్చులు పోనీ వచ్చిన మొత్తాన్ని ఆదాయంగా లెక్కిస్తున్నామని తెలుపగా, అదనపు సిఇఒ సంతృప్తి చెందారు. అలాగే మహిళా సంఘాలు సభ్యులు తప్పనిసరిగా ప్రతి నెలా సమావేశాల పెట్టుకోవాలని, ఈ ఏడాది నుండి ప్రతి సంఘం ఒక సమావేశం స్థలం నిర్ణయించుకొని, జియో ఫినిషింగ్‌ చేయాలని, ఇకపై ప్రతి సంఘం ఆ స్థలానికి వెళ్లి సమావేశం పెట్టుకుంటేనే సమావేశం పెట్టినట్లు అవుతుందని తెలిపారు. పాడేరు, విశాఖ జిల్లాలో పర్యటించానని, అమ్మవలసలో ఎన్యూమీటర్లకు ఈ సర్వేపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. సమా వేశంలో ఇన్‌ఛార్జి ఎసి శివున్నాయుడు, సిసిలు పి.రామకృష్ణారావు, కె.భాస్కరరావు పాల్గొన్నారు.మక్కువ : మండలంలోని చెముడులో జరుగుతున్న సర్ఫ్‌ సర్వేను రాష్ట్ర సర్ఫ్‌ అదనపు సిఇఒ కె.శ్రీరాములు నాయుడు, డిఆర్‌డిఎ పిడి సుధారాణి పరిశీలించారు. ఎన్యూమనేటర్‌ లను సర్వే ఏ విధంగా చేస్తున్నారని, ఒక సభ్యురాలి ఆదాయం ఏవిధంగా లెక్కిస్తున్నారని ప్రశ్నించగా, ప్రస్తుతం వస్తున్నా ఆదాయంలో ఖర్చులు పోనీ వచ్చిన మొత్తాన్ని ఆదాయంగా లెక్కిస్తున్నామని తెలపగా ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. అలాగే మహిళా సంఘాలు సభ్యులు తప్పనిసరిగా ప్రతి నెలా సమావేశాల పెట్టుకోవాలన్నారు. ఇకపై ప్రతి సంఘం ఆ స్థలానికి వెళ్లి సమావేశం పెట్టుకుంటేనే సమావేశం పెట్టినట్లు అవుతుందని తెలిపారు.

➡️