పార్వతీపురం టౌన్ : వైసిపి 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగాయి. ఇందులో భాగంగా పార్వతీపురం ఆర్‌టిసి కాంప్లెక్స్ కూడలి వద్ద ఉన్న వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు పార్టీ జెండా ఆవిష్కరించి వైసీపీ శ్రేణులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్వతీపురం, పాలకొండ మాజీ ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, విశ్వాసరాయి కళావతి, మన్యం జిల్లా వివిధ మండలాలకు చెందిన వైసిపి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సాలూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఎం పదవికి అనర్హుడని మాజీ డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. వైసిపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బుధవారం పట్టణంలోని బోసు బొమ్మ జంక్షన్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావం పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వైసిపి పట్టణ అధ్యక్షుడు వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు, సీనియర్ నాయకులు దండి శ్రీనివాసరావు, పి.రామకృష్ణ, ఎం.అప్పారావు, కొల్లి వెంకటరమణ పాల్గొన్నారు.
