ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : మారిటైమ్ ఎక్సర్ సైజ్ మలబార్ 2024 కు భారతదేశ ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖ వేదికగా అక్టోబర్ 8 నుండి 18 వరకు మొదట హార్బర్ ఫేజ్, తర్వాత సి ఫేజ్ లలో ఇది జరుగుతుంది. ఈ వ్యాయామంలో భారతదేశంతోపాటు ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాల నావికా దళాలు పాల్గంటాయని అధికారులు తెలిపారు. ఈ మలబార్ విన్యాసాలు హిందూ మహాసముద్రం, ఇండో – పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం కోసం 1992లో యునైటెడ్ స్టేట్స్ భారత నావికా దళాల మధ్య ద్వైపాక్షిక నావిక విన్యాసాలుగా ప్రారంభమయ్యాయి. తర్వాత కాలంలో భాగస్వామ్య దేశాల మధ్య పరస్పర అవగాహన పెంపొందించడం, సముద్ర సవాళ్లను పరిష్కరించడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈ విన్యాసాల్లో భారత నావికా దళం గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్లు, మల్టీ పర్పస్ ఫ్రిగేట్లు, జలాంతర్గాములు, ఫిక్స్డ్ వింగ్ ఎంఆర్, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో పాల్గొంటుండగా , ఆస్ట్రేలియా నావికాదళం ఎంహెచ్ -60ఆర్ హెలికాప్టర్ , పి 8 మారిటైమ్ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ , అన్జాక్ క్లాస్ ఫ్రిగేట్ అయిన హెచ్ ఎంఎఎస్ స్టువర్ట్ లతో పాల్గంటుంది. అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ నేవీ తన సమగ్ర హెలికాప్టర్లు , పి 8 మారిటైమ్ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ , ఆర్లీ బర్క్ క్లాస్ డిస్ట్రాయర్ యుఎస్‌ఎస్ డ్యూరు ను రంగంలోకి దించనుంది, జపాన్ నేవీ మురాసామే క్లాస్ డిస్ట్రాయర్ జెఎస్ అరియాకేతో కలిసి ఈ విన్యాసాల్లో పాల్గంటుంది ఈ వ్యాయామంలో భాగంగా సబ్జెక్ట్ మేటర్ , ఎక్స్చేంజ్, ఉపరితలం, గగనతలంపై ప్రత్యేక ఆపరేషన్ల , యాంటీ సబ్ మెరైన్ వాఫైర్స్ దేశాల మధ్య సహకారం కొరకు చర్చలు, కార్యాచరణ సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి విస్తఅత స్థాయి సమావేశాలు నిర్వహించబడతాయి. హార్బర్ ఫేజ్ ను అక్టోబర్ 9వ తేదీ సందర్శకుల దినోత్సవం రోజున ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే నాలుగు దేశాల ప్రతినిధులు కు తూర్పునావికాదళ కమాండింగ్ ఆఫీసర్ , కమాండింగ్ ఇన్ చీఫ్, వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ఆతిథ్యం ఇవ్వనున్నారు.
విశాఖ వేదికగా అక్టోబర్ 8 నుండి18 వరకు మారీటైం ఎక్ససైజ్ మలబార్ 2024
