వివాహిత ఆత్మహత్

వివాహిత ఆత్మహత్

భర్త వికృతచేష్టలు, లైంగిక వేధింపుల తాళలేక వివాహిత ఆత్మహత్

యప్రజాశక్తి -గోపాలపట్నం : గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నందమూరి నగర్‌లో గురువారం రాత్రి వివాహిత ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం కెజిహెచ్‌ వద్ద మృతురాలి బంధువులతోపాటు గోపాలపట్నం సిఐ జి.అప్పారావు తెలిపిన వివరాలివి. నందమూరినగర్‌కు చెందిన చిక్కాల నాగేంద్రబాబుకు గాజువాక ప్రాంతానికి చెందిన ఏడువాక వసంత (24)తో 11నెలల క్రితం వివాహమైంది. ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న నాగేంద్రబాబు పెళ్లయిన నాటి నుంచి భార్య వసంతను లైంగికంగా అనేక వేధింపులకు గురిచేసేవాడు. భర్త వికృతచేష్టలు, లైంగిక వేధింపులు భరించలేని వసంత తన తల్లిదండ్రుల వద్ద గోడును వెల్లబోసుకునేది. గురువారం రాత్రి కూడా అదేమాదిరిగా సెక్స్యువల్‌ వేధింపులకు గురిచేయడంతో తన బావకు విషయాన్ని వాట్సాప్‌లో మెసేజ్‌ పెట్టిందని మృతురాలి బంధువులు అంటున్నారు. ఎప్పటికీ భర్త తీరులో మార్పు రాకపోవడంతో మానసిన వేదనకు గురైన వనంత గురువారం రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు ఒడిగట్టిందని మృతురాలి బంధువులు తెలిపారు. స్థానికులు ఆమెను ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ అప్పటికే మృత్యువాత పడిందని వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై సిఐ అప్పారావు మాట్లాడుతూ, గురువారం రాత్రి 100కు ఫోను కాల్‌ రావడంతో వెంటనే అప్రమత్తమై నందమూరినగర్‌కు వెళ్లామన్నారు. మృతురాలి తల్లిదండ్రులు సన్యాసమ్మ, వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, వసంత బలవన్మరణం ఘటన ప్రత్యేక కేసుగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలి బంధువులిచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి, నాగేంద్రబాబును అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని నుంచి ఫోను, ట్యాబ్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ వెల్లడించారు.

➡️