వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు

Apr 12,2024 14:15 #Resignations, #volunteers

ప్రజాశక్తి – బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : మండలం, బడికాయలపల్లి, బీరంగి, బయప్పగారిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని 54 మంది గ్రామవాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ఈ మేరకు శుక్రవారం తమ రాజీనామా పత్రాలను ఎంపిడిఓ ఆఫీస్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ థామస్‌ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి తరపున రాబోయే ఎన్నికల్లో కష్టపడి పనిచేసి మళ్లీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కఅషి చేస్తామని, మళ్లీ వైఎస్సార్సీపి ప్రభుత్వం తరఫున ప్రజలకు సేవ చేయడానికి ముందుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు తాము అందించే సేవలను ఎవరు అడ్డుకోలేరని తెలిపారు.

➡️