ఆలయాల్లో భారీ చోరీ

Apr 3,2024 09:28 #Massive theft, #temples

వజ్రపుకొత్తూరు (శ్రీకాకుళం) : వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం శివాలయంలో మంగళవారం అర్థరాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు పది లక్షల రూపాయల విలువచేసే వెండి, బంగారు వస్తువులను దొంగిలించారు. శివాలయ పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో సుమారు లక్ష విలువ చేసే వెండి వస్తువులను ఎత్తుకుపోయారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

➡️