అగ్ని ప్రమాద బాధితులకు మాతా రమాబాయి అంబేడ్కర్ ఫౌండేషన్ సాయం

Mar 11,2025 17:06 #Konaseema

ప్రజాశక్తి – అమలాపురం రూరల్ : అమలాపురం మండలం సమనస గ్రామ పరిధి రంగాపురం బాబునగర్ లో అగ్ని ప్రమాద బాధితులకు మాతా రమాబాయి అంబేడ్కర్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ పుణ్యమంతుల రజని ఆధ్వర్యంలో మంగళవారం నిత్యావసర వస్తువులు, వస్త్రాలు అందజేసి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా పుణ్యమంతుల రజని మాట్లాడుతూ మనవతా దృక్పథంతో చల్లపల్లి, సింగరాయపాలెం, అనాతవరం సభ్యులు వీటిని సమకూర్చాలని అన్నారు. సభ్యుల సహకారంతో ఫౌండేషన్ తరపున ఆనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే దాతలెవరైనా మరింత మంది ఇలా సాయం చేయడానికి ముందుకొస్తే బాధితులకు భరోసా లభిస్తుందన్నారు. తమవంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రాల సుజాత, జంగా తనూజ, అయితాబత్తుల భీమాబాయి, అయితాబత్తుల మంగ, కందేరి మణి తదితరుల పాల్గొన్నారు.

➡️