మేడేను పండుగలా నిర్వహించాలి : సిఐటియు

ప్రజాశక్తి-వెలిగండ్ల : మేడేను పండుగలాగా నిర్వహించాలని సిఐటియు మండల కార్యదర్శి రాయళ్ళ మాలకొండయ్య పిలుపునిచ్చారు. స్థానిక కార్యాలయంలో సిఐటియు మండల కమిటీ సమావేశం మల్లెలరాణి అధ్యక్షతన సోమవారం ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ అంగన్‌వాడీ మినీ కేంద్రాలను మెయిన్‌ సెంటర్లుగా మార్చాలన్నారు. అందుకు సంబంధించిన జీవో కాపీని వెంటనే విడుదల చేయాలన్నారు.ఏప్రిల్‌ 21న విజయవాడలో నిర్వహిస్తున్న ధర్నాను జయప్రదం చేయాలని తెలిపారు. పనిగంటలు తగ్గించాలన్నారు. కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పెండింగ్‌ వేతనాలు, బిల్లులు వెంటనే విడుదల చేయాలనారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు ఎస్‌.మరియమ్మ, ఆశా వర్కర్‌ నాయకురాలు హేమేలమ్మ, విఒఎ మండల అధ్యక్షుడు అలేఖ్య, కోలా సునీత, మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు నాగమ్మ, పాఠశాల ఆయా మరియమ్మ, బిల్డింగ్‌ వర్కర్‌ ఆదినారాయణ రెడ్డి, సిఐటియు నాయకులు పగడాల చక్రిరావు, రసూల్‌, ఐద్వా నాయకురాలు మీరాబి, ఆటో వర్కర్‌ నాయకుడు రమేష్‌, కోలా నరేష్‌, జెపి.రాజు తదితరులు పాల్గొన్నారు.

➡️