ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : నగరంలోని సమస్యలపై అధికారులు వేగంగా స్పందించాలని మీరు మహమ్మద్ వసీం ఆదేశించారు. శుక్రవారం ఉదయం 50వ డివిజన్ పరిధిలో మేయర్ మహమ్మద్ వసీం స్థానిక కార్పొరేటర్ గురు శేఖర్ బాబుతో కలసి పర్యటించారు.ఈ సందర్భంగా స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.పారిశుధ్య సమస్యలు, రోడ్లు పై గుంతలు ఉండటం,కాలువలు లేకపోవడం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కార్పొరేటర్ శేఖర్ బాబు మేయర్ దఅష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మేయర్ వెంటనే ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, డ్రైనేజీలు ఏర్పాటుతోపాటు,రోడ్ లపై గుంతలు పూడ్చేందుకు అంచనాలు తయారు చేసి టెండర్లు పిలవాలని ఆదేశించారు. మేయర్ వెంట కార్పొరేటర్ కమల్ భూషణ్, ఈ రాధాకృష్ణ, డి ఈ నరసింహులు, ఏఈ రాజశేఖర్ రెడ్డి, ఎంహెచ్‌ఓ విష్ణుమూర్తి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
కార్పొరేటర్ మునిశేఖర్ తండ్రిని పరామర్శించిన మేయర్
అనారోగ్యంతో బాధపడుతున్న కార్పొరేటర్ ముని శేఖర్ తండ్రిని, వైసీపీ నాయకులు రఫీ లను వారి ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. మేయర్ వెంట కార్పొరేటర్ కమల్ భూషణ్ , వైసీపీ నాయకులు నాయకులు కాకర్ల శీనా పాల్గొన్నారు.
