ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణా) : స్థానిక మండల ప్రజా పరిషత్ ఎం.ఓ గా ఎండి ఇమ్రాన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఏ కొండూరు మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా ప్రమోషన్ లో భాగంగా గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయం ఎఓ గా విధులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిషత్ విధి,విధానాలను సక్రమంగా నిర్వహించేలా కృషి చేస్తానని తెలిపారు. ఆయనకు ఎంపీడీవో డి కఅష్ణవేణి, పంచాయతీ కార్యదర్శులు ఏజేయల్ నరసింహారావు, సిహెచ్ ఉమామహేశ్వరరావు, ఎస్ రమేష్, ఎలీషా రావు, గోవర్ధన్ రావు, కోటేశ్వరరావు, విజరు మండల పరిషత్ సిబ్బంది శుభాకాంక్షలు తెలుపుతూ స్వాగతం పలికారు.
