శిక్షణలో మాట్లాడుతున్న ఆర్‌ఒ నాగలక్ష్మి
ప్రజాశక్తి-గుంటూరు : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాల్లో ప్రిసైడింగ్ అధికారులు, మెక్రో అబ్జర్వర్లు సమన్వయంతో బాధ్యతులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. ప్రిసైడిండ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లకు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన శిక్షణలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు ఎన్నికలు జరిగే ముందురోజు డిస్ట్రిబ్యూషన్ సెంటరు నుంచి పూర్తిస్థాయిలో పోలింగ్ సామగ్రి తీసుకొని పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్‌కు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ రోజు ఉదయం 8 గంటలకు ఓటింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిసైడింగ్ అధికారి, మొదటి పోలింగ్ అధికారి, రెండవ పోలింగ్ అధికారి, మూడవ పోలింగ్ అధికారిగా నియమించిన ఓపీఓలు వారికి నిర్దేశించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రిసైడింగ్ అధికారి డైరీతో పాటు, ఇతర నాన్ స్టాట్యూటరీ, స్టాట్యూటరీ ఫారాలను సక్రమంగా పూర్తిచేసుకొని, బ్యాలెట్ బాక్స్‌లు సక్రమంగా సీజ్‌చేసి రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించాలన్నారు. పోలింగ్ మెటీరియల్ తీసుకున్నప్పటి నుంచి తిరిగి వాటిని రిసెప్షన్ కేంద్రాల్లో అప్పగించే వరకు ప్రిసైడింగ్ అధికారులు అలసత్వం లేకుండా విధులు నిర్వహించాల న్నారు. పోలింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులను ఫిబ్రవరి 20వ తేది నాటికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి పోస్టుద్వా రాగానీ, స్వయంగా గానీ అందించాలని చెప్పారు. దరఖాస్తులు అందించిన వారి చిరునామాకు పోస్టల్ బ్యాలెట్ మెటీరియల్ పోస్ట్ ద్వారా అందిస్తామని, ఓటు నమోదు చేసి పోస్టల్ బ్యాలెట్ కవర్లు మార్చి 2వ తేది నాటికి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరేలా పోస్ట్ చేయాలని సూచించారు. సంయుక్త కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను సమన్వ యం చేసుకుంటూ పోలింగ్ మెటీరియల్ తీసుకునేటప్పుడు, పోలింగ్ ప్రక్రియ ప్రారంభా నికి అన్ని అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలిం చుకోవాలన్నారు. సమావేశంలో ప్రిసైడింగ్ అధికారులకు, మైక్రో అబ్జర్వర్లు నిర్వర్తించాల్సిన విధులు, బ్యాలెట్ బాక్సులు ఓటింగ్‌కు సిద్ధం చేసే విధానం, సీల్ వేసే విధానంపై మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్, వీడియో చిత్రాల ద్వారా స్వయంగా బాలెట్ బాక్స్ తో సమగ్రంగా శిక్షణ ఇచ్చారు. శిక్షణలో డిఆర్‌ఒ ఎన్.ఎస్‌కె ఖాజావలి, ప్రిసైడింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు.
