విద్యార్థులు ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం
ర్యాగింగ్ నివారణకు చర్యలు
ప్రజాశక్తి -వెంకటాచలంయూనివర్శిటీ ర్యాగింగ్ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు విఎస్‌యు ఇన్‌ఛార్జి ఉపకులపతి ఎస్ విజయభాస్కర్‌రావు తెలిపారు. మండలం లోని కాకుటూరులో ఉన్న విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో సోమవారం యాంటీ ర్యాగింగ్ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయభాస్కర్ రావు మాట్లాడుతూ విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలన్నారు. విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ నియంత్రణకు యాంటీ ర్యాగింగ్ కమిటీ, యాంటీ ర్యాగింగ్స్ స్క్వాడ్ నిరంతరం పనిచేస్తున్నాయన్నారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులతో సఖ్యతతో మెలగాలని సూచించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత మాట్లాడుతూ ర్యాగింగ్‌కు గురికావడం గమనిస్తే లేదా స్వయంగా భాధితుడైతే, వెంటనే యాంటీ ర్యాగింగ్ కమిటీకి లేదా విద్యాసంస్థ యాజమాన్యానికి సమాచారాన్ని ఇవ్వాలన్నారు.విద్యార్థుల చేత చేత ర్యాగింగ్‌కు పాల్పడబోమని ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సిహెచ్. విజయ, కోఆర్డినేటర్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ హనుమారెడ్డి, డిప్యూటీ వార్డెన్స్ డాక్టర్ మణికంఠ, డాక్టర్ త్రివేణి, డాక్టర్ శ్రీ కన్యరావు, చీఫ్ వార్డెన్ ఆచార్య సుజా ఎస్. నాయక్ పాల్గొన్నారు.
