కళా ఉత్సవ్‌ లో కడియం విద్యార్థులకు పతకాల పంట

ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : జాతీయ కళా ఉత్సవ్‌ 2024 పోటీల్లో భాగంగా జిల్లా పరిధిలో బొమ్మూరు డైట్‌ కాలేజీలో ఆరు విభాగాల్లో పోటీల్లో నిర్వహించగా, మూడు విభాగాల్లో కడియం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. వి. గాయత్రి నాగదేవి జానపద గేయాల విభాగంలో ద్వితీయ స్థానం, జానపద నృత్యంలో వై.సత్యసాయి మోహన పవిత్ర తృతీయం, వాయిద్య సంగీతంలో విభాగంలో షేక్‌ షరీన్‌ తృతీయ, చిత్రలేఖనంలో షేక్‌ అబ్దుల్‌ రహీంకు కన్సిలేషన్‌ గెలుచుకున్నారు. విజేతలైన విద్యార్థులను వారికి శిక్షణ నిచ్చిన గొల్లపల్లి సత్యనారాయణను పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, ఉపాద్యాయులు రఫీయుద్ధీన్‌, రామకృష్ణంరాజు, శ్రీవెంకట దుర్గ, శరత్‌ బాబు, సువర్ణవేణి, సూరిబాబులు అభినందించారు.

➡️