ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న కె.జగదీష్ స్కూల్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నవంబర్ 16 నుంచి 18 వరకు నార్త్ గోవాలో జరిగిన జాతీయ 10వ ఓపెన్ స్కూల్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొని అండర్- 19 బాక్సింగ్ పోటీలలో 60-63 కిలో గ్రాముల బరువు కేటగిరీలో బంగారు పతకం సాధించాడు. డిసెంబర్ 20 నుంచి 24 వరకు నేపాల్ లో జరిగిన ఇండోనేపాల్ స్కూల్ గేమ్స్ ఛాంపియన్‌షిప్ ఓపెన్ బాక్సింగ్ అండర్- 19 అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో 60-63 కిలోల బరువు కేటగిరిలో రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన సభలో కళాశాల డైరెక్టర్ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ డివి రామమూర్తి, విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీలత, అధ్యాపకులు, విభాగాధిపతులు, ఫిజికల్ డైరెక్టర్లు, కోచ్‌లో పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2025/01/seetam.jpg)