200 మందికి వైద్యపరీక్షలు

ప్రజాశక్తి-కొండపి : కామ్రేడ్‌ ముప్పురాజు శేషయ్య 24వ వర్ధంతి సందర్భంగా మండల పరిధిలోని పెరిదేపి గ్రామంలో మంగళవారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. తొలుత ప్రగతి నర్సింగ్‌ హోం డాక్టర్‌ బి.హరిబాబు ముప్పరాజు శేషయ్య చిత్ర పటానికి పూలమాలలు నివాళులర్పించారు. అనంతరం శ్రీశివాని హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్‌ ప్రత్యూష , ప్రగతి నర్సింగ్‌ హోం వైద్యులు డాక్టర్‌ బి.హరిబాబు ఆధ్వర్యంలో 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించినప్పుడల్లా వైద్య సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పెరిదేపి గ్రామం చైతన్యానికి, రాజకీయ అవగాహన కలిగిన గ్రామమని తెలిపారు. ఈ గ్రామాన్ని తీర్చిదిద్దిన కామ్రేడ్‌ శేషయ్య వర్ధంతి సందర్బంగా ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనటం తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంగాపు ఏసుదాసు, ఎ.బ్రహ్మయ్య, మల్లెల చిన్న పేతురు, మల్లెల రాధ, గడ్డం పిచ్చయ్య, పారబత్తిని శ్రీనివాసులు, అంగలకుర్తి జంబులు, సుధాకర్‌, దావీదు, మునేంద్ర, వేములపాటి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️