ప్రజాశక్తి- ఇంకొల్లు : ఇంకొల్లులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో నర్సారావు పేటలోని నిమాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి కరి కమలేశ్వరరావు, విశ్రాంత ఎంఇఒ గోరంట్ల హరిబాబు ,క్యాంప్ ఇన్చార్జి వీరయ్య,సంఘం అధ్యక్షులు వై. కష్ణమూర్తి, కోశాధికారి తూమాటి ఆంజనేయులు, ఆర్గనైజింగ్ కార్యదర్శి గోపాలరావు, కార్యవర్గ సభ్యులు గోరంట్ల హరిబాబు, బ్రహ్మనాయుడు, తగిరశ వీరాంజనేయులు, నూతలపాటి చెన్నకేశవరావు, వజ్జా వెంకటేశ్వర్లు, రావి ఈశ్వరమ్మ, జాగర్లమూడి ప్రభాకరరావు పాల్గొన్నారు.