కుడుపూరులో 302 మందికి వైద్య పరీక్షలు

May 14,2024 16:26 #ramachandrapuram

ప్రజాశక్తి -రామచంద్రపురం :కే గంగవరం మండలంలోని కుడుపూరు గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో 302 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. పేకేరు ఆరోగ్య కేంద్రం వైద్యులు ఎం శ్రీలక్ష్మి, ఈ ఎన్‌ టి వైద్యులు మోహన్‌ బాబు , సిబ్బంది వైద్య సేవలు అందించారు. మరికొందరిని జిల్లా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. కుడుకూరు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ ఆరోగ్య వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందారు.

➡️