డాక్టర్‌ సి ఎల్‌ ఆధ్వర్యంలో వైద్య సేవలు

Oct 5,2024 15:43 #Dr. C.L, #Medical services

గుడ్లవల్లేరు (కృష్ణా) : ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ సి.ఎల్‌ వెంకటరావు ఆధ్వర్యంలో గుడ్డవల్లేరులోని జన్మభూమి మెడికల్‌ క్యాంపులో శనివారం వందలాది మంది రోగులకు వివిధ రుగ్మతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏలూరు సెయింట్‌ జోసెఫ్‌ డెంటల్‌ వారి వైద్యులు రోగులకు దంత వైద్య పరీక్షలు చేశారు. విజయవాడ సివిఆర్‌ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ వారి వైద్యులు రోగులకు గుండె పరీక్షలు చేశారు. అవసరమైన రోగులకు ఉచిత మందులు పంపిణీ చేపట్టారు. అలాగే ఆదివారం విజయవాడ కామినేని హాస్పిటల్‌ వారు, హౌమియో వైద్యులు, ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి వారు తమ వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించనున్నారని డాక్టర్‌ సి ఎల్‌ వెంకటరావు పేర్కొన్నారు.

➡️