గర్భిణులకు వైద్య పరీక్షలు

Jun 10,2024 20:27
గర్భిణులకు వైద్య పరీక్షలు

గర్భిణులకు పరీక్షలు చేస్తున్న దృశ్యం
గర్భిణులకు వైద్య పరీక్షలు
ప్రజాశక్తి -గుడ్లూరు గుడ్లూరు ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రంలో ప్రధానమంత్రి మాతత్వ సురక్ష పథకం కింద మండలంలోని 36 మంది గర్భిణులకు వైద్య పరీక్షలు సోమవారం నిర్వహించారు. వైద్య అధికారిని సాయి ప్రియాంక గర్భిణులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా చేశారు. రక్తహీనత, హై రిస్కులో ఉన్న ఏడుగురు గర్భిణులను గుర్తించి వారికి ప్రత్యేక వైద్యసదుపాయాలు కల్పించారు. గర్భిణులందరూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రంలో కాన్పులు చేయించుకోవాలని వైద్య అధికారిని వారికి సూచించారు. ఎఎన్‌ఎంలు వైజి సిబ్బంది పాల్గొన్నారు.

➡️