లేపాక్షిలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలపై సమావేశం

లేపాక్షి (అనంతపురం) : ఈనెల 25వ తేదీ నుండి మార్చి ఒకటో తేదీ వరకు లేపాక్షిలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం మధ్యాహ్నం నందు కమిటీ సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్‌ కరణం రమానందం మాట్లాడుతూ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఉత్సవాలు జరిగే ఐదు రోజులపాటు వచ్చే భక్తులకు అన్నదానము ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. కానుకలు హుండీలో వేసే విధంగా అక్కడక్కడ స్కానర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆలయం అభివఅద్ధికి విరాళాలు ఇచ్చేవారు దేవాదాయ శాఖ వారిని సంప్రదించి విరాళాలు ఇచ్చి రసీదు పొందాలన్నారు. దేవాలయానికి వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లో దేవుని దర్శించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణ అధికారి నరసింహమూర్తి తో పాటు దేవాదాయ సిబ్బంది, కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

➡️