17న కాకినాడ అర్బన్ మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మెగా వార్షికోత్సవం

Apr 15,2025 16:15 #Kakinada

ప్రజాశక్తి – కాకినాడ : ఈనెల 17వ తేదీన కాకినాడ అర్బన్ మండలం విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో (ఆనంద భారతి హైస్కూల్) మెగా వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతుందని కాకినాడ అర్బన్ మండలం ఎంఈఓ-1 కేవీపీ సత్యనారాయణ, ఎం ఈ ఓ-2 సిహెచ్ రవి తెలిపారు. మెగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీల సభ్యులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి నారా లోకేష్ ఆకాంక్షలకు అనుగుణంగా కాకినాడ అర్బన్ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలలో పాఠశాల వార్జికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. అదే సమయంలో కాకినాడ అర్టన్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక ఆనందభారతి ఉన్నత పాఠశాల ఆవరణలో మెగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతారన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మండల విద్యాశాఖ ఇప్పటికే పూర్తి చేయడం జరిగిందన్నారు. మెగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేసి సమీక్ష చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఆఫీసు సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని ఈ సందర్భంగా ఎంఈఓ 1 కే వి వి సత్యనారాయణ, ఎంఈఓ 2 సిహెచ్ రవిలు విజ్ఞప్తి చేశారు.

➡️