మెగా రక్తదాన శిబిరం

ప్రజాశక్తి-సంతనూతలపాడు మండలంలోని పి గుడిపాడు డొంక వద్దనున్న కృష్ణసాయి గ్రానైట్స్‌లో కృష్ణ సాయి గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిద్దా హనుమంతరావు 59వ జన్మదిన వేడుకను పురస్కరించుకుని ఒంగోలు రిమ్స్‌ వారి ఆధ్వర్యంలో శనివారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సిబ్బంది 101 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కృష్ణ సాయి గ్రానైట్‌ డైరెక్టర్‌ కె ఉదయభాను, 3వ యూనిట్‌ హెడ్‌- రాజా, మేనేజర్‌ సుబ్రహ్మణ్యంరాజు, యూనిట్‌-2, మేనేజర్‌ ఎంవి రావు, క్వారీస్‌ జీఎం మురళీమోహన్‌, యూనిట్‌-1, జీఎంఎం రాంబాబు, మువ్వా శ్రీనివాస్‌, కృష్ణ సాయి క్వారీ మేనేజర్స్‌ కమలాకర్‌, క్వారీ వివిధ విభాగాల హెడ్స్‌, ఇతర మేనేజర్లు, ఇన్‌ఛార్జి, 3-యూనిట్స్‌ ఉద్యోగులు, మరియు హెచ్‌ఆర్‌ డిపార్టుమెంటు హెడ్స్‌, హనుమంతరావు బాల్యస్నేహితులు, ఇతర శ్రేయోభిలాషులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో రిమ్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రసన్న, వారి సిబ్బంది పాల్గొన్నారు.

➡️