ప్రజాశక్తి – ఆలమూరు : స్థానిక మండల ప్రజా పరిషత్ సూపరింటెండెంట్ గా (ఏవో) ఎం.వి.మెహర్ ప్రకాష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన కపిలేశ్వరపురం మండలం నుంచి బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు సూపరింటెండెంట్ గా బాధ్యతలు నిర్వహించిన రామ్ స్వరూప్ ఆత్రేయపురం మండలానికి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అందుబాటులో ఉంటూ, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు, సిబ్బంది సహాయ సహకారాలతో సేవలు అందిస్తామని తెలిపారు.
