ప్రజాశక్తి-మద్దిపాడు: టిడిపి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ సభ్యత్వం కార్డులు అందజేయాలని మండల టిడిపి అధ్యక్షులు మండవ జయంత్ బాబు తెలిపారు. మద్దిపాడులోని టిడిపి కార్యాలయంలో సోమవారం సభ్యత్వ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షలు ప్రమాద బీమా లభిస్తుందన్నారు. కుటుంబ సాధికార సారథులు, బూత్ కన్వీనర్లు ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యత్వం కార్డులను అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముళ్ళురి మురళి, నరసింహారావు, రెబ్బవరపు ప్రభాకర్, మారెళ్ల సురేంద్ర, మన్నె శేషయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.
