పాఠశాలల్లో ఎంఇఒ తనిఖీలు

Jan 24,2025 22:22
ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ తోట శ్రీనివాసులు

ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ తోట శ్రీనివాసులు
పాఠశాలల్లో ఎంఇఒ తనిఖీలు
ప్రజాశక్తి – ఉదయగిరి : మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉదయగిరి బిసి తెలుగు, ప్రాథమికోన్నత పాఠశాల బిసి ఉర్థూ, వెంకట్రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలల్లో శుక్రవారం ఎంఇఒ- తోట శ్రీనివాసులు ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. వచ్చే ఏడాది నుండి అప్‌గ్రేడ్‌ అవుతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉదయగిరి బీసీ ఉర్థూ పాఠశాలను హైస్కూల్‌ గాను, ప్రాథమిక పాఠశాల ఉదయగిరి బిసి తెలుగు పాఠశాలను మోడల్‌ ప్రైమరీ పాఠశాలగా గాను వెంకట్రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను హై స్కూల్‌గా స్థాయిని పెంచడానికి ప్రతిపాదనలు జిల్లాకు పంపడం జరిగిందన్నారు. అందులో భాగంగా ముందస్తుగా ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించామని వచ్చే విద్యా సంవత్సరం నుండి హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేయబడుతున్న పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు నూతన బోధన జరిగేందుకు చర్యలు తీసుకోని బోధన జరగాలన్నారు. అనంతరం పాఠశాలల్లో విద్యార్థుల పఠన అభ్యసన సామర్థ్యాలను, డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం, విద్యార్థుల ఉపాధ్యాయుల హాజరు, స్కూల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ ఇంప్రూవ్మెంట్‌ పనులు, కిచెన్‌ గార్డెన్స్‌, పాఠశాలల అన్ని రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

➡️