చేతి వృత్తిపనిదారుల ఉపాధి కల్పనకు కృషి : మెప్మా పీడీ విశ్వ జ్యోతి

ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌ : నగరంలోని చేతివృత్తి పని వారితో ఉపాధి కల్పనతో పాటు నగర ప్రజలకు మెరుగైన పౌర సేవలను అందించడాని కై సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా ప్రభుత్వం కృషి చేస్తుందని పట్టణ పేదరిక నిర్మూలన విభాగం మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ విశ్వ జ్యోతి తెలిపారు. శుక్రవారం స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాలులో చేతి వృత్తి పని వారితో సమావేశం నిర్వహించారు. సర్వీస్‌ ప్రొవైడర్‌ ఫేస్‌ వన్‌ కింద చేతివృత్తి పని వారి రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో టెక్నికల్‌ ఎక్స్ప్రెస్‌ భవాని వాసుదేవ రెడ్డి సిటీ మిషన్‌ ఇన్చార్జి మేనేజర్‌ శ్రీనివాసులు కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … ప్రభుత్వం హోం ట్రయాంగిల్‌ ఆప్‌ వారితో ఒప్పందం కుదుర్చుకుంది అన్నారు. హోం ట్రయాంగిల్‌ యాప్‌ లో చేతి వృత్తి పనివారు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు ఓల్షా ర్షాపిడ్‌ తదితర యాప్లు మాదిరిగా నగర ప్రజలకు విద్యుత్‌ వడ్రంగి తదితర సేవలు హోం ట్రయాంగిల్‌ యాప్‌ ద్వారా పొందవచ్చును అన్నారు ఉదాహరణకు ఎవరికైనా ఇంట్లో విద్యుత్‌ చెక్కపని పైప్‌ లైన్‌ తదితర సేవలు పొందాలనుకున్నవారు హోం ట్రయాంగిల్‌ యాప్‌ లో నమోదు చేసుకుంటే అందుకు సంబంధించిన సమీప చేతివృత్తి పనివారికి సమాచారం వెళుతుందన్నారు వారు వెంటనే సంబంధిత వ్యక్తి ఇంటికి వెళ్లి వారికి అవసరమైన సేవలు అందించి వస్తారన్నారు వారు ఒకవేళ బిజీగా ఉంటే వెళ్ళటానికి వీలుపడదని సమాచారం పంపితే మరొకరిని వారి సేవలకు పంపడం జరుగుతుందన్నారు తద్వారా ఇంటిలో కూర్చొని గృహ యజమానులు అవసరమైన అత్యవసర సేవలు పొందవచ్చు అన్నారు ఎందుకు అవసరమైన ఫీజును యాప్‌ ద్వారా నిర్ధారించి వారికి చెల్లించడం జరుగుతుందన్నారు ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉంటూ చేతి వృత్తి పనివారికి ఉపాధి కొరత లేకుండా చూడవచ్చును అన్నారు కావున ఔత్సాహిక చేతి వృత్తి పనివారు సర్వీస్‌ ప్రొవైడర్లో రిజిస్టర్‌ చేసుకుని ఉపాధి పొందాలని సూచించారు.

➡️