ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : దేశంలో అలజడులు సఅష్టించేలా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు హెచ్చరించారు. పాకిస్తాన్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఉద్వేషపూరితమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా ఎవరైనా షేర్ చేసిన, పోస్ట్ చేసిన ఆడియో, వీడియో మెసేజ్ ల రూపంలో గ్రూపుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన అటువంటి వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసేముందు అది వాస్తవమైనదా కాదా నిర్ధారణ చేసుకున్న తర్వాతే గ్రూపుల్లో షేర్ చేయాలని అలా కాకుండా మెసేజ్లను ఫార్వర్డ్ చేస్తే గ్రూప్ అడ్మిన్లే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా పోలీస్ వారి ఆదేశాలను మీరి అవాస్తవమైన, విద్వేషపూరితమైన మెసేజ్లను, ఆడియో, వీడియోలను షేర్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడబోమని హెచ్చరించారు.
అలజడులు సృష్టించేలా మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు : జిల్లా ఎస్పీ
