అపరిశుభ్ర వాతావరణంలో మిడ్డే మీల్స్‌

అపరిశుభ్ర వాతావరణంలో మిడ్డే మీల్స్‌

తోటగరువు ఉన్నతపాఠశాలలో పరిస్థితులపై కలెక్టర్‌ అసంతృప్

తిప్రజాశక్తి – అరిలోవ : పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్యకరమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం పెట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎంఎస్‌.హరేంధిర ప్రసాద్‌ ఆదేశించారు. మంగళవార చినగదిలి మండలం తోటగరువు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు . పాఠశాలలో విద్యార్థుకు కల్పించిన వసతులు, ఇతర పరిస్థితులను పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథక అమలు తీరును, నాణ్యతను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంలో పిల్లలకు భోజనం వడ్డించడంపై కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల క్రీడా స్థలం నిర్వహణ సరిగ్గా లేకపోవటం, ఇనుపరాడ్లు అడ్డదిడ్డంగా ఉండటాన్ని తప్పుబట్టారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా క్రీడా స్థలాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. పారిశుధ్య నిర్వహణకు ప్రాధాన్యత ఇవ్వాలని, చెత్త డబ్బాలను ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.డిఇఒ ప్రేమ్‌ కుమార్‌, ఎంఇఒలు, ఇతర అధికారులు ఉన్నారు.

యుపిహెచ్‌సిలో ఒపి సంఖ్య పెరగాలి

ఆరిలోవ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్‌, అక్కడ వైద్య సేవలను పరిశీలించారు. ఒపి సంఖ్య తక్కువగా ఉండడాన్ని గుర్తించి, పెంచాలని ఆదేశించారు. మెరుగైన వైద్యసేవలు అందించేందుకు తగు సూచనలు చేశారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించి, రోగులకు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

➡️