ప్రజాశక్తి-కొండపి (ప్రకాశం) : దేశంలో అత్యధిక పింఛన్లుస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం నాడు కొండపి మండలంనెన్నూరుపాడులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గన్న మంత్రి ఇంటింటికీ తిరిగి లబ్ధిదారులకు ఫించన్ అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ….. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క సంతకంతో పింఛను రూ.4 వేలకు పెంచడం జరిగిందన్నారు. లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడడని ప్రభుత్వ సెలవు వస్తే ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు. రెండు నెలలు తీసుకోకపోయినా తర్వాత నెలలో 3 నెలల ఫించన్ ఒకేసారి తీసుకునేలా వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. జిల్లాలో మొత్తం 2 లక్షల 86 వేల 34 మందికి ఈ రోజు 122 కోట్ల 22 లక్షల రూపాయలు పింఛన్ కింద ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొండపి మండలంలో 6,268 మందికి 2 కోట్ల లక్షల 80 వేల రూపాయలు, నెన్నూరుపాడు గ్రామంలో 241 మందికి 10.20 లక్షలు రూపాయలు ఎన్టీఆర్ భరోసా పధకం కింద పింఛన్లు అందచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అర్హులైన వారందరికీ త్వరలో ఇళ్ల స్థలాలు, ఇల్లు మంజూరు చేస్తామన్నారు. నూతన పింఛన్లు జనవరి నుంచి మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. పింఛన్లు తొలగించామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అర్హులైన వారందరికీ ఫించన్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ఐదు ఏళ్ళ పాలనలో అన్ని కార్పొరేషన్లు నిర్వీర్యం అయ్యాయని, కార్పొరేషన్ల ద్వారా త్వరలో అర్హులందరికీ స్వయం ఉపాధికి రుణాలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచి ఇస్తున్నాం, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచితంగా అందిస్తున్నాం. పేదలకు ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాం, ఆరోగ్యశ్రీ వర్తించన వారికి సీఎం ఆర్.ఎఫ్ ద్వారా సాయం చేస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో జరిగిన అభివఅద్ధి తప్ప గత పాలనలో గ్రామాల్లో అభివృద్ధి శూన్యమన్నారు. నెన్నూరుపాడు గ్రామంలో 2014 – 19 లోనే సిసి రోడ్లు, లైట్లు వేయించాం, గ్రామాన్ని అన్ని విధాల అభివఅద్ధి చేశామన్నారు. మర్రిచెట్లపాలెం, ఉప్పల పాలెం కలుపుతూ రోడ్లు వేయించాను. అన్నీ మన హయాంలో వేసినవే. కొండపి నియోజకవర్గానికి సాగర్ నీరందిస్తామని…వచ్చే వేసవిలో పనులు ప్రారంభిస్తామని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మా నాయక్, ఎస్ సి కార్పొరేషన్ ఈడి శ్రీ అర్జున్ నాయక్, మండల పరిధిలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.