అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

Dec 8,2024 21:42

ప్రజాశక్తి-సాలూరు : సాలూరు పట్టణంలో పలు అభివృద్ధి పనులకు గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.63 లక్షల వ్యయంతో అఫిషియల్‌ కాలనీ, శివాజీ సెంటర్‌, గొల్లవీధి, 6, 7, 8 వార్డులలో డ్రెయిన్లు, రోడ్లు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నో ఏళ్ల కలగా మిగిలిన డ్రెయిన్ల పనులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించడంతో మంత్రి సంధ్యారాణికి 6, 7 వార్డుల మహిళలు అభినందనలు తెలిపారు. 8వ వార్డులో స్వయంగా జెసిబి వాహనం నడిపి పనులను మంత్రి ప్రారంభించారు. త్వరలో పైలట్‌ వాటర్‌ స్కీమ్స్‌పట్టణంలో నీటి సరఫరా లేని వీధులలో త్వరలోనే పైలట్‌ వాటర్‌ స్కీమ్స్‌ ద్వారా నీటిని అందిస్తామని మంత్రి చెప్పారు. శ్యామలాంబ అమ్మవారి జాతరకు ముందుగానే పట్టణంలో అవసరమైన ప్రదేశాల్లో రోడ్లు, మరుగుదొడ్లు, మంచినీరు ఇబ్బందులు లేకుండా చేస్తామని మంత్రి తెలిపారు. సాలూరులో దేశమ్మతల్లికి ప్రజలు పసుపు కుంకుమలు సమర్పించి, అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.విద్యుదాఘాతానికి గురైన వ్యక్తి మృతిప్రజాశక్తి – కురుపాంస్థానిక కోటినగర్‌ లేఅవుట్లోని అక్షర పబ్లిక్‌ స్కూల్లో సిసి కెమెరాలు పనితీరు పరిశీలించేందుకు గురువారం వచ్చిన టెక్నీషియన్‌ పాలక మురళీధర్‌ (38) విద్యుదాఘాతానికి గురైన విషయం తెలిసిందే. కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం రాత్రి పరిస్థితి విషమించి మరణించినట్లు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. మురళీధర్‌ సోదరుడు సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

➡️