కడప నుంచి హైదరాబాద్‌ కు ఫ్లైట్‌ ను ప్రారంభించిన మంత్రి మండిపల్లి రామ్‌ ప్రసాద్‌ రెడ్డి

ప్రజాశక్తి – కడప : కడప నుంచి హైదరాబాద్‌ కు ఈనెల 27వ తేదీ నుంచి ప్రతి రోజు వెళ్లేహొ ఇండిగో ఫ్లైట్‌ ను ఆదివారం రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి కడప విమానాశ్రయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ …. ఈనెల 27వ తేదీ నుంచి ప్రతిరోజు కడప నుంచి హైదరాబాదుకు ఇండిగో ఫ్లైట్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కడప నుంచి హైదరాబాద్‌ కు వెళ్లాలంటే ఎంతో సమయం పడుతుందని ప్రయాణికుల సౌకర్యాన్ని వారి సమయాన్ని వఅధా చేయకుండా విమాన సర్వీసులు ప్రారంభించడం జరిగిందన్నారు. రాబోయే రోజులలో కడప నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని విమాన సర్వీసు సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు.హొ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్య రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

➡️