ప్రజాశక్తి – రాయచోటి రాయచోటి నియోజకవర్గంలో ఉన్న అర్హులైన పేద మైనార్టీలందరికీ రేషన్ కార్డులు, ఇళ్లు, పెన్షన్లు మంజూరు చేసి వారి అభివద్ధికి కషి చేస్తామని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పాత రాయచోటిలోని పాత ఈద్గాలో మంత్రి నూతన బోరుకు మోటార్ బిగించి ఈద్గాలో నీటి సమస్య పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో కంటే రాయచోటి నియోజకవర్గంలో ఎక్కువ మంది మైనార్టీ సోదరులు నివసిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి మన రాయచోటి నియోజకవర్గంలోని మైనార్టీలం దరికీ ప్రభుత్వపరంగా అందాల్సిన పథకాలన్నీ వారి ముంగిటకు తీసుకెళ్లి మైనార్టీల అభివద్ధికి కషి చేయడం చేస్తామని చెప్పారు. అతి పురాతనమైన ఈద్గా అభివద్ధికి తమ వంతు సహాయ సహకా రాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈద్గా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. రాయచోటి పట్టణంలో 75 నుంచి 80 శాతం మంది ముస్లింలు వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారని అలాంటి వారందరికీ ప్రభుత్వ పరంగా అందాల్సిన పథకాలన్నీ వారికి అందజేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో అర్హులైన పేదలకు ఎవరికి ఇల్లు దక్కలేదని నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రతి ఒక్కరు ఇల్లు మంజూరు చేయాలని అర్జీలు సమర్పించడం జరుగుతుందన్నారు. ఇల్లు లేని నిజమైన పేదలందరికీ ఈ ప్రభుత్వంలో ఇంటి స్థలాలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రేషన్ కార్డుల సమస్య కూడా పరిష్కరించడం జరుగుతుందన్నారు. చిన్నమండెం హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న పాత మసీదులో చిన్న ఫంక్షన్ హాల్ నిర్మించేందుకు వచ్చే మే, జూన్ మాసంలో శంకుస్థాపన చేసస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
