కోటప్పకొండ తిరునాళ్లపై మంత్రి పరిశీలన

Feb 18,2025 01:26

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26న రాష్ట్ర పండుగ అయిన కోటప్పకొండకు తిరునా ళ్లకు వచ్చే వారికి అసౌకర్యం కలుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి, పల్నాడు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. తిరునాళ్ల నేపథ్యంలో కొండపైన, కొండ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ఎమ్మెల్యేతో కలిసి మంత్రి సోమవారం పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికా ర్లను ఆదేశించారు. 20 లక్షల మందికి వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గల్లు ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. అదే విధంగా సమాచార మార్పిడి లోపం లేకుండా మైక్‌ ప్రచార కేంద్రం నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. క్యూలైన్లలో తాగునీరు, మజ్జిగ, ఏర్పాటు తోపాటు నీడ కోసం టెంట్లు, రవాణ, పారిశుధ్యం తాత్కాలిక వసతి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. కోటప్పకొండను రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రంగా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

➡️