పొట్టి శ్రీరాములుకు మంత్రి నిమ్మల ఘనంగా నివాళ్లు

ప్రజాశక్తి-పాలకొల్లు(పశ్చిమగోదావరి) : పొట్టి శ్రీరాములు ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌లు మోడీ సహకారంతో తెలుగు జాతి అభివృద్ధి అమరావతి రాజధాని వైపు ప్రపంచం చూసేలా నెంబర్‌ వన్‌గా తీర్చనున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలిపేందుకు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. భాషా ప్రయోక్త రాష్ట్రాల ఏర్పాటుకు, బహుజనులు ఆలయ ప్రవేశాలకు బాటలు వేసిన మహానుభావులన్నారు. పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం – సత్యం, అహింస, హరిజనోద్దరణకు జీవితాంతం కషి చేశారని చెప్పారు. అమరజీవి ఆశయ సాధన కోసం పునరంకితమవుదామని పిలుపునిచ్చారు.

➡️