ప్రజాశక్తి-చిన్నమండెం ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్య తనిస్తోందని రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని బోరెడ్డిగారిపల్లెలోని తమ నివాసంలో మంత్రి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి కానీ ప్రజల గురించి పట్టించుకునే నాధుడే లేరన్నారు. ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు నిరంతరం ప్రజాసేవకే తన సమయాన్ని కేటాయించి ప్రజల సంక్షేమానికి కషి చేయడం జరుగుతుందన్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలంటే ప్రజలు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే వారిని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కులమత, ప్రాంత బేధాలు లేకుండా పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటికే తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో అనర్హులకు పెన్షన్లు మంజూరు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ప్రభుత్వం ఏర్పడిన 9, నెలల కాలంలోనే నిజమైన లబ్ధిదారులను గుర్తించి ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం క షి చేస్తుందన్నారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల అర్జీలు స్వీకరించి అక్కడికక్కడే వారి సమస్యలు పరిష్కరించడం జరిగింది. ప్రతి గ్రామానికి మౌలిక వసతుల కల్పనకు కృషిరామాపురం : ప్రతి మారుమూల గ్రామానికి సైతం మౌలిక వసతులు కల్పిస్తా మని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. తాగునీరు, వీధిదీపాలు, సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాటు చేయడమే తమ ధ్యేయమన్నారు. మండలంలోని శుద్ధ మల్ల గ్రామం పాత పంచాయతీ కార్యాలయం నుంచి ఎగువ దళితవాడకు రూ.16.80లక్షలతో వేసిన సిమెంట్ రోడ్డును మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారక నాథరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మండలంలోని సమస్యలను పరిష్కరించడంలో వైసిపి ప్రభుత్వం విఫల మైందన్నారు. రామపురం మండలాన్ని ద్వారకానాథ్‌రెడ్డి సహకారంతో మరింత అభివద్ధి పథంలో నడిపిస్తామన్నారు. మండలలలోని ప్రజలు తమ సమస్యలపై మంత్రికి అర్జీలు సమర్పించారు. సమస్యలపై అధికారులు చర్చించి పరిష్క రిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ గడికోట కిరణ్‌కు మార్‌రెడ్డి, లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మద్దిరేవుల రమేష్‌రెడ్డి ఆగ్రో వెంకట్రామిరెడ్డి, ఆంజనేయులురెడ్డి, రాయచోటి అర్చన కళాశాల అధినేత మదన్ మోహన్‌రెడ్డి, సరస్వతి పల్లి గ్రామం సర్పంచ్ మునీర్‌బాషా, గాలివీటి సురేందర్ రెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జి, రామకష్ణ గౌడ్, రేఖం సోదరులు పాల్గొన్నారు.
